దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదనీ, ఇందుకోసం అవసరమైతే తన రాజకీయ భవిష్యత్‌ను సైతం ఫణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. అవినీతి రహిత పౌర సేవకు తాము కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు.
నోట్ల రద్దుకు ముందు నల్ల ధనం ఓ సమాంతర ఆర్థిక వ్యవస్థగా కొనసాగిందని, కానీ ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత నల్ల ధనం దేశ ఆర్థిక వ్యవస్థలో కలిసిపోయిందన్నారు. నోట్ల రద్దు తర్వాత సేకరించిన డేటా ఆధారంగా అవినీతికి పాల్పడిన వారి వివరాలు బయటకు వస్తున్నట్లు ప్రధాని తెలిపారు.