Businessman: రూ.15కోట్లు అప్పుంది.. కన్నబిడ్డ పరిస్థితి బాగోలేదు.. లైవ్‌లోనే ఆత్మహత్య

సెల్వి

గురువారం, 10 జులై 2025 (19:25 IST)
యూపీ ల‌క్నోలో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. 36 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫేస్‌బుక్ ఆన్‌లైన్ లైవ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. త‌న‌కు రూ.15 కోట్ల అప్పు ఉంద‌ని, అతని బిజినెస్ పాట్నర్ తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆరోపించాడు. డ‌యాబెటిక్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న త‌న కూతుర్ని ఇన్సులిన్ ఇవ్వలేక‌పోతున్నట్లు అత‌ను ఆవేద‌న వ్యక్తం చేశాడు. 
 
ఎవరైనా ముందుకు వచ్చి తనని ఆదుకోవాలని వేడుకున్నాడు. ఫేస్‌బుక్ లైవ్ వీడియో చూసి ఫ్యామిలీ స‌భ్యులు పోలీసుల‌కు చెప్పారు. అయితే స్పాట్‌కు వెళ్లే స‌రికి అత‌ను షూట్ చేసుకుని చ‌నిపోయాడు. సెక్యూర్టీ లైసెన్స్ ఉన్న 12 బోర్ గ‌న్‌తో అత‌ను కాల్చుకున్నాడు. అప్పుల బాధ‌లు త‌ట్టుకోలేక ఇలా చేస్తున్నానని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు