మాయావతిని వేశ్యతో పోల్చిన బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ అరెస్టు!

శుక్రవారం, 29 జులై 2016 (16:30 IST)
బీఎస్పీ అధినేత్రి మాయావతిని వేశ్యతో పోల్చిన భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కొన్ని గంటల్లోనే ఆయన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసి ఘాటైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 
 
మాయావ‌తిని వేశ్యతో పోల్చ‌డంతో పెద్ద ఎత్తున‌ దుమారం రేగడంతో ఆయ‌నను బీజేపీ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. ఈ వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టి రోజే ద‌యాశంక‌ర్‌ను అరెస్ట్ చేయ‌డానికి పోలీసులు ఇంటికి వెళ్లినా ఆయ‌న క‌నిపించ‌లేదు. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని ఓ శివాల‌యం ద‌గ్గ‌ర ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో రావ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. యూపీ, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఆయ‌న కోసం గాలించి శుక్రవారం బీహార్‌లో అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి