రాష్ట్రంలోని బిపిఎల్ కుటుంబాలకు ప్రభుత్వం తరపున 20 కిలోల గోధుమలు, 15 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో దేనికీ కొరత లేదని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కరోనా వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఆర్థికసాయం ప్రకటించలేదు.
కానీ.. యోగీ మాత్రం యూపీ ప్రజల కోసం ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీలో ఇప్పటివరకు 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అందులో 9మంది రికవరీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల దాదాపు 11 వేల మందికి పైగా చనిపోగా.. 2 లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు. ఈ వైరస్ దాదాపు 195 దేశాలలో విస్తరించింది.