ఇద్దరు యువకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. టిక్ టాక్ వీడియో కోసం ఓ మూగ జీవిని నిర్దాక్షిణ్యంగా సజీవంగా చంపేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు కిరాతకులను పట్టించినా, ఆచూకీ తెలిపినా వారికి రూ.50 వేలు నజరానా ఇస్తామని ప్రకటించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఇద్దరు యువకులు టిక్ టాక్ వీడియో కోసం ఓ శునకాన్ని చిత్ర హింసలకు గురిచేశారు. కుక్కను నాలుగు కాళ్లు కట్టేసి చెరువులో విసిరేశారు. పైగా, ఆ కుక్కుపైకి లేవకుండా దానిపై రాళ్లు విసిరారు. ఈ దృశ్యాన్ని వీడియో చిత్రీకరించి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ కిరాతక యువకుల పట్ల జంతు పరిరక్షణ సంస్థ పెటా ఆగ్రహం వ్యక్తం చేసింది.