ఒకే ఆలయం.. ఒకే బావి.. ఒకే శ్మశానవాటిక : మోహన్ భగవత్ పిలుపు

ఠాగూర్

సోమవారం, 21 ఏప్రియల్ 2025 (10:12 IST)
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజంలో కులభేదాలు అంతం చేయాలని పిలుపునిచ్చారు. హిందువులకు 'ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశానవాటిక' అనే సూత్రాన్ని స్వీకరించడం ద్వారా సామాజిక సామరస్యం కోసం కృషి చేయాలని కోరారు. 
 
ఐదు రోజుల పర్యటనలో భాగంగా, ఈ నెల 17వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో పర్యటిస్తున్న భగవత్ హెచ్‌బీ ఇంటర్ కాలేజ్, పంచన్ నగ్రీ పార్కు‌లోని రెండు శాఖల్లోని స్వయం సేవకులతో వేర్వేరుగా మాట్లాడారు. 
 
సమాజంలోని అన్ని వర్గాలు వారికి చేరువకావాలని, అట్టడుగు స్థాయిలో సామరస్య, ఐక్య సందేశాన్ని వ్యాప్తి చేయడానికి వారిని తమ ఇళ్లలోకి ఆహ్వానించాలని కోరారు. విలువలే హిందూ సమాజానికి పునాది అని పేర్కొన్నారు. సంప్రదాయం, సాంస్కృతిక విలువలు, నైతిక సూత్రాలు కలిగిన సమాజాన్ని నిర్మించాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు