పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాను. ఈ పరీక్షల్లో నా ప్రతిభతో పనిలేకుండా నన్ను పాస్ చేయండి. పదో తరగతి పరీక్షల్లో పాస్ చేసి నన్ను, నా ప్రేమను బతికించండి అంటూ ఓ విద్యార్థి జవాబు పత్రంలో రాశాడు. దీన్ని చూసిన ఉపాధ్యాయుడు షాక్‌కు గురయ్యాడు. కర్నాటక రాష్ట్రంలోని బెళగావిలో జిల్లాలో ఎలాగైనా పాస్ చేయాలని, అపుడే తన ప్రేమ నిలుస్తుందని రాసుకొచ్చాడు. మూల్యాంకనం చేస్తున్న క్రమంలో చూసిన ఉపాధ్యాయుడు అది చూసి షాకయ్యారు.
పదో తరగతి పాస్ అయితేనే తనతో ప్రేమ కొనసాగిస్తానని ప్రియురాలు చెప్పిందని జవాబు పత్రంలో రాసిన విద్యార్థి నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. అమ్మాయి ప్రేమ కొనసాగించాలంటే నేను పాస్ కావాలి అని రాశాడు. దయచేసి తనను పాస్ చేయాలని కోరుతూ ఆన్సర్ షీట్ మధ్యలో రూ.500 పెట్టాడు. ఈ డబ్బుతో టీ తాగాలని, తనను పాస్ చేయాలని అభ్యర్థించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాకెక్కడంతో ఇది కాస్త వైరల్ అయింది.