అయితే కేరళలోని శబరిమలలో తుఫాన్ కారణంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని, మాల ధరించిన భక్తులు ఇప్పుడు శబరిమలకు రావద్దని సూచనలు చేశాడు ఓ భక్తుడు. ఈ వర్షం ఇంకో మూడు నుంచి నాలుగు రోజులు ఉండే అవకాశం ఉందని, భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని వీడియో సందేశంలో కోరాడు.
తుఫాన్ కారణంగా కొండ చరియల్లో చెట్లు విరిగి పడుతున్నాయని, కొండపై పూర్తిగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇలాంటి సమయంలో శబరిమలకు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ భక్తుడు పేర్కొన్నాడు. మాల ధరించిన భక్తులు కొంత సమయం ఆగి తుఫాన్ తగ్గాక ప్రయాణాన్ని మొదలు పెట్టాలని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇకపోతే.. మండలం- మకరవిలక్కు సీజన్ ముగియడానికి చివరి 10 రోజుల్లోగా అయ్యప్ప రూపంలోని బంగారు లాకెట్లను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకుని వచ్చేలా చర్యలు చేపట్టామని ట్రస్ట్ తెలిపింది. 1980లో తొలిసారిగా అయ్యప్ప స్వామి బంగారు లాకెట్లను వినియోగంలోకి తీసుకొచ్చారు అధికారులు. 2011- 2012 సీజన్ వరకూ అమ్మకాలు కొనసాగాయి. అప్పట్లో ఆగిపోయిన ఈ లాకెట్ల విక్రయాన్ని మళ్లీ మొదలెట్టనుంది అయ్యప్ప ఆలయ ట్రస్ట్.