కృష్ణ జింకను వేటాడారన్న కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలాడు. జోథ్ పూర్ కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఐతే ఇదే కేసులో ఇరుక్కున్న ఇతర నటులు సైఫ్ అలీఖాన్, టబు, సొనాలీ బింద్రేలను మాత్రం నిర్దోషులుగా తేల్చింది. కాగా ఈ ఘటన 1998 అక్టోబర్ 1 అర్ధరాత్రి సమయంలో జరిగింది. హమ్ సాథ్ సాథ్ హై మూవీ షూటింగ్‌లో సల్మాన్ వున్నాడు. ఐతే ఈ కేసుపై తీర్పు రావడానికి 20 ఏళ్లు పట్టడంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో జోకులు పేలుతున్నాయి.
కృష్ణ జింకను వాళ్లు చంపలేదు. ఈ బాలీవుడ్ స్టార్టలను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై దానికదే కిందపడి గిలగిల కొట్టుకుని చచ్చిపోయిందంటూ ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. మరొకతడైతే... కృష్ణ జింక జీవిత కాలమే 10 నుంచి 15 ఏళ్లనీ, ఐతే కృష్ణ జింకను చంపిన కేసులో దోషులను తేల్చడానికి 20 ఏళ్లు పట్టింది.. వహ్వా అంటూ సెటైర్లు విసిరాడు. ఇలా ఎవరికి తోచినట్లు వారు జోకులు పేల్చుతున్నారు.