మహారాష్ట్రలో 24 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

గురువారం, 20 జనవరి 2022 (18:37 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి తగ్గింది. దీంతో సుధీర్ఘకాలం తర్వాత సోమవారం నుంచి పాఠశాలల తెలుపులు తెరుచుకోనున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ నెల 24వ తేదీ నుంచి స్కూల్స్ తెరువనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి వర్షా గ్వైక్వాడ్ వెల్లడిచారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో వచ్చే నెల 15వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించామన్నారు. కానీ, ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిందన్నారు. అందువల్ల కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను తెరవాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
నిపుణుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, విద్యా సంస్థలను తెరిచే అంశంపై స్థానిక అధికారులతో పాటు.. మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు తుది నిర్ణయం తీసుకోవచ్చన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు