స్పాకు రిలాక్సేషన్ కోసం పోతుంటారు. వెలుగులతో కూడిన హోర్డింగ్‌లతో కళకళలాడుతున్న ఓ స్పాలో సెక్స్ రాకెట్ బయటపడింది. బ్యూటీ పార్లర్, స్పా ముసుగులో సెక్స్ రాకెట్ నడుపుతున్న ఓ గ్యాంగ్ గుట్టురట్టయ్యింది. స్పా బాగోతాన్ని బయటపెట్టేందుకు పోలీసులు మారు వేషాలతో వెళ్లారు. ఆ తర్వాత కస్టమర్లని, అమ్మాయిలు కావాలని అడిగేసరికి.. అసలు వ్యవహారం బయటపడింది. అంతలోనే బయటి నుంచి ఖాఖీలు ఒక్కసారిగా స్పాను చుట్టుముట్టేయడంతో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. హర్యానా స్టేట్ గురుగావ్ సిటీ ఎంజీరోడ్డులోని క్వీన్ స్పా పేరిట కొందరు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మారువేషాల్లో స్ఫాకు వెళ్లి… 12 మంది వ్యభిచారిణులతోపాటు ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ జరిగేదంతా సెక్స్ కార్యకలాపాలేనని పోలీసులు నిర్ధారించుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. స్పా ఓనర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.