మధ్యప్రదేశ్‌లో బాహుబలి - భళ్లాలదేవ యుద్ధం.. ఎప్పుడో తెలుసా?

శుక్రవారం, 31 ఆగస్టు 2018 (15:17 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో అటు అధికార భాజపా, ప్రతిపక్ష పార్టీలు అప్పుడే నెట్లో పోరాటాలు ప్రారంభించాయి. ఇందుకుగాను వారు బాహుబలి చిత్రాన్ని బాగా వాడేసుకుంటున్నారు. 
ఫోటో క్రెడిట్- యూ ట్యూబ్ నుంచి
 
ఇంతకీ విషయం ఏంటయా అంటే... మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బాహుబలిగా అభివర్ణిస్తూ యూ ట్యూబులో స్ఫూఫ్ ఒకటి చక్కెర్లు కొడుతోంది. భాజపా అభిమానులు ఈ స్పూఫ్‌ను తయారుచేసి నెట్లో వదిలారు. ఇప్పుడది హల్చల్ చేస్తోంది. కాగా భళ్లాలదేవగా జ్యోతిరాదిత్య సింధియాను మార్చారు. అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కమల్ నాథ్ ఇలా చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలను వైరివర్గంలో చేర్చిన వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు