హత్య చేస్తూ... జై కాళీమాత అంటూ 108 సార్లు మంత్రాన్ని జపించే సీరియల్ కిల్లర్...

బుధవారం, 21 నవంబరు 2018 (13:37 IST)
వాడు నరరూప రాక్షసుడు. 7 హత్యలు, 600 దోపిడీలు అతడి ఖాతాలో వున్నాయి. డబ్బు, నగల కోసం ఎంతటి దారుణానికైనా తెగబడతాడు. ఎవరైనా ఎదురుతిరిగినా, తనకు హాని చేస్తారని అనుకున్నా వెంటనే వాళ్లను హతమారుస్తాడు. ఇలా ఏడుగురిని హత్య చేశాడు. ఐతే హత్య చేసే ముందు సదరు వ్యక్తిని చిత్ర హింసలకు గురి చేస్తాడు. అతడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే... ప్రాణం తీస్తూ... జై కాళీమాతా... అంటూ 108 సార్లు కాళీమాత మంత్రాన్ని జపిస్తూ ఈ హత్య చేయడం వల్ల తనకు ఎలాంటి హాని కలుగకూడదని చెప్పి మరీ ప్రాణం తీసేస్తాడు. 
 
హర్యానాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ మిస్టరీ హత్యలను ఛేదించారు పోలీసులు. జగతర్ సింగ్ అనే వ్యక్తి హత్యలకు దోపిడీలకు కారణమని తెలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఐతే హత్యకు ముందు అతడు చేసే వింత చేష్టలు, వింత ప్రవర్తనను దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. హర్యానాతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా తను హత్యలకు పాల్పడినట్లు అతడు చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు