దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సీన్ కొరతపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో గురువారు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి డీవీ సదానంద గౌడ తీవ్ర స్థాయిలో స్పందించారు. కోర్టులు ఆదేశించిన పరిమాణంలో వ్యాక్సీన్లు ఉత్పత్తి చేయలేకపోతే పాలకులు ఉరేసుకోవాలా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యాక్సీన్ పంపిణీపై ప్రభుత్వానికి ఓ కార్యాచరణ ప్రణాళిక ఉండాలనీ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండాలన్నారు. అక్కడక్కడా వ్యాక్సీన్లు కొరత ఏర్పడటం వాస్తవమే అయినప్పటికీ... వాక్సీన్ల పంపిణీ కోసం ప్రభుత్వం శక్తివంచన లేకుండా, నిజాయితీగా పనిచేస్తోందని సదానంద పేర్కొన్నారు.