మొదటి డోస్ రిజిస్ట్రేషన్ల రద్దు
మరోవైపు, కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ కోసం ఈ నెలాఖరు వరకు ఎవరూ వ్యాక్సిన్ కేంద్రాలకు రావొద్దని కలెక్టర్ తెలిపారు. జూన్ మొదటి వారం నుంచి ఫస్టు డోస్ అందుబాటులో ఉంటుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా స్లాట్ బుకింగ్ చేసుకోలేరని చెప్పారు. అలానే ఫస్టు డోస్ కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఎలాంటి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి వీలుండదన్నారు.
వారికి ఫోన్, ఎస్‌ఎంఎస్ ద్వారా ఏ తేదీన ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకోవాలో తెలియజేయడం జరుగుతుందన్నారు. టోకెన్లు ఉన్న వారిని మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. లబ్ధిదారులను గదుల్లో భౌతిక దూరం పాటించేలా కూర్చొబెట్టి వారి వద్దకే సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్ వేస్తారని చెప్పారు.