charlie kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య (video)

ఐవీఆర్

గురువారం, 11 సెప్టెంబరు 2025 (12:08 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, అమెరికా పొలిటికల్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఉటా వ్యాలీ యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న కిర్క్ ను గుర్తు తెలియని దుండగులు ఎదురుగా కాల్చి చంపారు.

తన సన్నిహితుడి హత్యపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా యువత మనసుల్ని చార్లీ కంటే ఎవ్వరూ బాగా అర్థం చేసుకోలేదు. అతడిని నాతో సమానంగా అందరూ అభిమానించారు. చార్లీ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. కాగా 31 ఏళ్ల చార్లీకి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు.
 

డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య

ఉటా వ్యాలీ వర్సిటీ ఈవెంట్లో దుండగుల కాల్పుల్లో గాయపడిన US పొలిటికల్ యాక్టివిస్ట్ ఛార్లీ కిర్క్(31) మృతిచెందారు. ఈ విషయాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. 'అమెరికా యువత మనసుల్ని చార్లీ కంటే ఎవరూ బాగా అర్థం చేసుకోలేదు. అతన్ని… pic.twitter.com/VDHsgNhUZw

— ChotaNews App (@ChotaNewsApp) September 11, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు