ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత సెలక్షన్ కమిటీ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ప్రమోషన్ లభించగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటగాళ్లుగా కొనసాగనున్నారు.
2027 ప్రపంచకప్ లక్ష్యంగా ఈ కీలక కెప్టెన్సీ మార్పు జరిగింది. వన్డేలు అక్టోబర్ 19-25 మధ్య సిడ్నీ, అడిలైడ్, మెల్‌బోర్న్‌లలో జరగనున్నాయి. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరుగుతుంది.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత వన్డే జట్టు: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (విసి), అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికె), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికె), యశస్వి జైస్వాల్.