మంత్రి స్మృతి ఇరానీకి రాహుల్ ఫ్లైయింగ్ కిస్... మహిళా ఎంపీల ఫిర్యాదు

బుధవారం, 9 ఆగస్టు 2023 (15:12 IST)
లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఈ అవిశ్వాసంపై చర్చ పూర్తికాగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి వెళ్లిపోయారు. వెళ్లేప్పుడు ఆయన ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. దీనిపై స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి ప్రవర్తన ఇంతకుముందు చూడలేదన్నారు. 
 
దీనిపై ఆమె రాహుల్ తీరును ఖండించారు. 'స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వగలరు. అలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైంది' అంటూ మండిపడ్డారు. 
 
ఇంకోవైపు, ఈ వ్యవహారంపై భాజపా మహిళా ఎంపీలు ఫిర్యాదు చేశారు. రాహుల్ అనుచిత ప్రవర్తనపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు ఇచ్చారు. కాంగ్రెస్‌ నేతపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు