అధికారంలో ఉన్నసమయంలో తాము చేసిన తప్పును కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికి తెలుసుకున్నట్టున్నారు. ఫలితంగానే బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు పార్లమెంటే వేదికగా గళం విప్పి, ఆందోళన చేస్తున్నారు. అయితే, లోక్‌సభలో గురువారం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, టీడీపీ ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంతనాలు జరపడం అందరినీ ఆకట్టుకుంది.
గత నాలుగు రోజులుగా ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు నిర్వహిస్తున్నా, ఏమాత్రం స్పందించని కాంగ్రెస్ పార్టీ... నేడు రూటు మార్చింది. ఏపీకి మద్దతిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏపీ విభజన చట్టం, హోదాపై చర్చ జరపాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నోటీసును ఇచ్చింది.
మరోవైపు, పోలవరానికి నిధులు, విశాఖపట్నం రైల్వే జోన్‌ల విషయంలో న్యాయం చేయాలని, ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్‌కు కేంద్రం తలొగ్గినట్టు తెలుస్తోంది. దీంతో కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పోలరవం ప్రాజెక్టుకు ప్రస్తుతానికి రూ.417.44 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద్ విడుదల చేస్తున్నట్టు కేంద్ర జలవనరుల మంత్విత్ర శాఖ అధికారులు తెలిపారు.