అదేపనిగా పురుషులు అలాంటి వీడియోలు చూస్తున్నారా?

సోమవారం, 9 డిశెంబరు 2019 (15:55 IST)
సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో పోర్న్ వీడియోలు చూసే వారి సంఖ్య పెరిగిపోతుందని ఇప్పటికే పలు సర్వేలు తేల్చాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో వుండటం.. డేటా ఆఫర్లు చౌకగా లభించడం ద్వారా పోర్న్ వీడియోలు చూసే పురుషుల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. అయితే పోర్న్ వీడియోలు చూసే పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తప్పవని తాజాగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 
ముఖ్యంగా బ్యాచిలర్స్, విడాకులు తీసుకున్న పురుషులు ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశం వుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వాళ్లలో ఎక్కువ మంది పోర్న్‌కు బానిసలుగా మారినవారేనని, మరికొందరు అసంతృప్తికరమైన సెక్స్ జీవితాన్ని అనుభవిస్తున్నవాళ్లు ఉన్నారని శాస్త్రవేత్తలు బ్రిటన్‌లో నిర్వహించిన సర్వేలో తేలిందని వివరించారు. 
 
బ్రిటన్‌లో దాదాపు 80 శాతం మంది సింగిల్, విడాకులు తీసుకున్న పురుషులు అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అదే పనిగా పోర్న్ వీడియోలను చూడటం ద్వారా శృంగారంపై కోరికలు తగ్గే ప్రమాదం కూడా వుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు