ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి సెటైర్లు విసిరారు. మెహబూబాను కుక్క తోకతో ఆయన పోల్చారు. కుక్కతోక వంకరగా ఉంటుందని, దానిని మార్చలేమని స్వామి ఓ ఇంటర్వ్యూలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాశ్మీర్‌లో ముఫ్తీకి బదులుగా రాష్ట్రపతి పాలన ఉండాలి. ఆమె కుక్క తోక వంటిది. దానిని చక్కదిద్దడం సాధ్యం కాదని చెప్పారు. గతం నుంచి ఆమెకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, ఆమె మారుతారనుకొని బీజేపీ ఆమె పార్టీతో పొత్తు పెట్టుకుందన్నారు.