వన్ నేషన్- వన్ రేషన్‌ను తక్షణమే అమలు చేయాలి.. మమతకు సుప్రీం మొట్టికాయ

శుక్రవారం, 11 జూన్ 2021 (19:18 IST)
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మొట్టికాయ వేసింది. ఆ రాష్ట్రంలో 'వన్ నేషన్- వన్ రేషన్' పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చెప్పకుండా వెంటనే ఈ పథకాన్ని వర్తింపజేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన పథకమని. మీ సమస్యలను ఉదహరించకుండా పథకాన్ని తక్షణం అమలు చేయాలని మమత ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
 
కాగా, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, ఢిల్లీలో తప్ప దేశవ్యాప్తంగా ఒకే దేశం.. ఒకే రేషన్ పథకం అమలవుతున్నది. అయితే రాజకీయ కారణాలతో సీఎం మమత బెంగాల్‌లో, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
 
ఇదిలా ఉంటే.. బీజేపీ నేత ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు సుభ్రాంషు రాయ్ కూడా బీజేపీలో చేరారు. సీఎం మమతా బెనర్జీ సమక్షంలో ఆయన తిరిగి తృణమూల్‌లో చేరారు. 
 
ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ... ''కుమారుడు తిరిగి సొంతింటికి చేరుకున్నాడు. ముకుల్ రాయ్ ఇంటి పిల్లవాడు. తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. పార్టీలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. బీజేపీలో చాలా దోపిడీ ఉంది. అందులో మనగలగడం ఇబ్బందే'' అని మమత వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు