మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం తప్పే.. కానీ, ఉద్ధవ్ సర్కారును పునరుద్ధరించలేం : సుప్రీం

గురువారం, 11 మే 2023 (15:36 IST)
మహారాష్ట్రలోని శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టి, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో బీజేపీ - శివసేన చీలిక వర్గం ఎమ్మెల్యేలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆ రాజకీయ సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాచారం లేనపుడు సభలో మెజార్టీని నిరూపించుకోమనడం సబబు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
అయితే, ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం సమర్థనీయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేసమయంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఇపుడు పునరుద్ధరించలేమని వ్యాఖ్యానించింది. దీనికి కారణం లేకపోలేదన్నారు.
 
ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్చంధంగా రాజీనామా చేయడమే ఇందుకు కారణమని తెలిపింది. 
 
శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం, షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల ధర్మాసనం విచారణ జరిపింది. 
 
ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ  కోల్పోయారన్న నిర్ధారణకు రావడానికి గవర్నర్ వద్ద తగిన సమాచారం లేనపుడు సభలో మెజార్టీని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని పిలవడం సరికాదని, కానీ, ఉద్ధ్ ఠాక్రే బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేయడంతో తిరిగి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని కోర్టు తెలిపింది. 
 
ఠాక్రే రాజీనామా చేయడంతో అప్పటికే అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ మద్దతు కలిగి షిండే వర్గంతో గవర్నర్ ప్రమాణం స్వీకారం చేయించిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు