లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

ఠాగూర్

శుక్రవారం, 4 అక్టోబరు 2024 (18:41 IST)
తమ ప్రభుత్వ హయాంలో ముమ్మాటికీ శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ కాలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిట్‌పైనా ఆయన విచిత్రమైన కామెంట్స్ చేశారు. సిట్ అధికారులు వచ్చి ఏం చేస్తారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 
 
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిందన్నారు. రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే... దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు, రాజకీయ డ్రామాలు చేయొద్దు అని స్పష్టమైన వ్యాఖ్యలు చేసిందని వివరించారు. చంద్రబాబు స్వయంగా వేసుకున్న సిట్‌ను సైతం రద్దు చేసిందని తెలిపారు.
 
లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించడం ద్వారా చంద్రబాబు తిరుమల పవిత్రతను, స్వామివారి విశిష్టతను మంటగలిపాడని, కోర్టులు సైతం చంద్రబాబుకు మొట్టికాయలు వేశాయని విమర్శించారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ చంద్రబాబు పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడాడని, చంద్రబాబు స్వయంగా నియమించుకున్న తితిదే ఈవోనే చంద్రబాబు మాటలకు విరుద్ధంగా లడ్డూలపై ప్రకటన చేశాడని జగన్ వెల్లడించారు.
 
ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే ఎవరైనా కొద్దో, గొప్పో సిగ్గుపడతారని... దేవుడి విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు భయం, భక్తి ఉన్న వ్యక్తి అయితే అతడిలో పశ్చాత్తాపం అనేది రావాలని పేర్కొన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు ముందుకు రావాలని అన్నారు. కానీ చంద్రబాబు ఎలాంటివాడంటే... పశ్చాత్తాపం ఉండదు, దేవుడంటే భయం ఉండదు, భక్తి ఉండదు అని జగన్ వ్యాఖ్యానించారు.  
 

ఈ సిట్ ఎందుకు ? బిట్ ఎందుకు ?

వట్టలు పిట్టలు అవుతున్నాయి జగ్గడికి ????????????????

pic.twitter.com/x0A3UXEs6w

— ???????????????????????????? (@Shiva4TDP) October 4, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు