ఎస్పీబీ ఇష్టంగా నిర్మించుకున్న ఫాంహౌస్‌లోనే ఆఖరి మజిలి...

శనివారం, 26 సెప్టెంబరు 2020 (11:00 IST)
తాను అమితంగా ఇష్టపడి నిర్మించుకున్న ఫాంహౌస్‌లోని గానగంధర్వుడు శ్రీపండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం ఆఖరి మజిలి ముగియనుంది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కం అనే గ్రామంలో ఎస్పీబీ అత్యక్రియలు ముగియనున్నాయి. ఈ అంత్యక్రియలు వీర శైవ జంగమ సంప్రదాయం ప్రకారం ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 
కూర్చున్న పొజిషన్‌లో బాలూ పార్ధివదేహాన్ని ఉంచి, అలాగే ఖననం చేయనున్నారు. తామరైపాక్కంలో తానెంతో ఇష్టంగా నిర్మించుకున్న ఫామ్ హౌస్‌లో ఆయన ఖననం జరుగనుంది. అక్కడే ఓ స్మారకాన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని కుటుంబీకులు వెల్లడించారు. దగ్గరి బంధుమిత్రులు, ప్రొటోకాల్ అధికారులతో పాటు... వందలాది మంది అభిమానులు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 
 
కాగా, శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు కన్నుమూసిన ఎస్బీబీ పార్థివదేహాన్ని చెన్నై మహాలింగపురంలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. అయితే, కోవిడ్ నిబంధనలు ఉన్న కారణంగా ఎస్పీబీని చివరి చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివస్తుండటంతో గత రాత్రే చెన్నైలోని కొడంబాక్కం నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తామరైపాక్కంకు తరలించారు. 
 
తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనుండగా, ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన అంత్యక్రియలకు ప్రారంభమై, ముగిశాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు