ఫినాయిల్ తాగిన ఐదుగురు విద్యార్థినులు.. ఎందుకంటే?

శుక్రవారం, 14 డిశెంబరు 2018 (14:56 IST)
తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో ఐదుగురు విద్యార్థినులు పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిల్ తాగారు. వీరంతా ఆత్మహత్య చేసుకోవడానికి ఈ పని చేశారు. ఇంతకు ఈ విద్యార్థినులు సామూహిక అత్యహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారో ఓసారి పరిశీలిద్దాం. 
 
విల్లుపురం జిల్లా అరసంబట్టు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు సహచర విద్యార్థులతో మాట్లాడారు. దీన్ని గమనించిన మరికొందరు విద్యార్థులు ఆ ఐదుగురు విద్యార్థినులను హేళన చేశారు. అబ్బాయిలో ఏం మాట్లాడారు... మీ మధ్య ఏదో జరుగుతుందంటూ గేలిచేశారు. 
 
ఈ మాటలతో క్షోభకు గురైన ఆ ఐదుగురు విద్యార్థినులు సామూహిక ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. పాఠశాల మరుగుదొడ్డిలో ఉన్న ఫినాయిల్‌ను సేవించారు. విద్యార్థుల నోటి నుంచి నురగలు వస్తుండటాన్ని గమనించిన స్కూల్ టీచర్లు... హుటాహుటీన వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు