జీవించాలా? లేక మరణించాలా? రాష్ట్రపతే తేల్చాలి : ట్రాన్స్‌వుమన్

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (11:43 IST)
తాను జీవించాలా? మరణించాలా? అనే విషయాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవిందే తేల్చాలంటూ ట్రాన్స్‌వుమెన్ షన్వి పొన్నుస్వామి అంటోంది. ఇంజనీరు, మోడల్, నటిగానే కాక ఓ జాతీయ స్థాయి ఎయిర్‌లైన్ సంస్థలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా షన్వి... లింగమార్పిడి చేయించుకున్న కారణంగా ఎయిరిండియా విమానయాన సంస్థ తనకు ఉద్యోగాన్ని నిరాకరించిందని, ప్రస్తుతం తనకు బతుకు భారమైందని, కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఆమె రెండ్రోజుల కిందట రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 
 
ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం కోసం షన్వి మూడేళ్ల కిందట లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. ఎయిరిండియాలో ఉద్యోగానికి అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించినా జెండర్ కారణంగా తనను ఎంపిక చేయలేదని ఆమె పేర్కొంది. ఇదే విషయమై ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఆయితే కోర్టు ఖర్చులు భరించలేకపోతున్నానని, తిండికి  కూడా డబ్బులు లేక తిప్పలు పడుతున్నానని, కారుణ్య మరణానికి తనకు అవకాశమివ్వాలని కోరుతూ ఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది. దీనిపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచూచూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు