రుణాల కోసం వచ్చే మహిళలకు ఎరవేసి క్యాషియర్ రాసలీలలు

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (11:28 IST)
అతనో బ్యాంకులో క్యాషియర్. తన వద్దకు రుణాల కోసం వచ్చే మహిళలకు ఎరవేసి వారిని లోబరుచుకుని రాసక్రీడలు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ తంతూ గత కొన్నేళ్లుగా సాగుతూ వస్తోంది. అదేసమయంలో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయసాగాడు. దీంతో భార్యకు అనుమానం వచ్చి పడక గదిలో రహస్య కెమెరాను అమర్చింది. దీంతో భర్త బాగోతం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్యను హత్య చేయాలని రెండుసార్లు ప్లాన్ వేశాడు. కానీ, అది విఫలమైంది. చివరకు భర్తపై విరక్తి చెందిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్తతోపాటు అత్తామామలు, ఆడబిడ్డ పరారీలో ఉన్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుచ్చి జిల్లాకు చెందిన ఎడ్విన్ జయకుమార్, వీరాలిమలైలో ఉన్న ఇండియన్ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు గతయేడాది డిసెంబరు 2న తంజావూరు జిల్లాకు చెందిన యువతి (32)తో వివాహమైంది. కాపురానికి వెళ్లిన ఆమె, జయకుమార్, తన ఇంట్లోని ప్రత్యేక గదిలో మహిళలతో గంటల తరబడి గడుపుతూ ఉన్నాడని, తనతో సఖ్యతగా లేడని గమనించింది. 
 
ఆపై ఓ రోజు అతని గదిలోకి వెళ్లి చూడగా, అక్కడ నమ్మలేని విషయాలు ఆమెకు బోధపడ్డాయి. 15 సెల్ ఫోన్లు, వాటిల్లో బ్యాంకు ఖాతాదారులమని చెప్పుకుని వచ్చే మహిళలతో సన్నిహితంగా ఉన్న చిత్రాలు, బాత్రూమ్ వీడియోలు... ఇలా ఎన్నింటినో చూసి అవాక్కైంది. అతని ఆగడాలను కట్టించాలని భావించి, సాక్ష్యాలను సేకరించింది. 
 
జరిగిన ఘోరాన్ని అత్త, ఆడపడుచు, ఇతర బంధువుల వద్ద చెప్పుకుని విలపించింది. అయితే, వారు సమస్యను పరిష్కరించకపోగా, కుటుంబ విషయాలను బయటకు చెప్పిందంటూ గృహ హింసకు దిగారు. ఆమె స్నానం చేస్తుండగా, వీడియో తీశామని, విషయాన్ని బయటకు చెబితే, దాన్ని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. 
 
దీంతో ఆమె విషయాన్ని తన కుటుంబీకులకు చేరవేసింది. వారు వచ్చి జయకుమార్‌ను నిలదీయడంతో, కోపాన్ని పెంచుకున్న అతను, భార్యను బయటకు తీసుకెళ్లి చంపేందుకు రెండు సార్లు ప్రయత్నించి విఫలం అయ్యాడు.
 
భర్త నుంచి తప్పించుకున్న భార్య, డీజీపీని కలిసి తన గోడు వెళ్లబోసుకోవడంతో, ఆయన ఆదేశాల మేరకు జయకుమార్, అతని తల్లి, సోదరి, బంధువు, దుర్మార్గాలకు సహకరించిన బ్యాంకు ఉద్యోగినిలపై కేసు నమోదైంది. ఆ వెంటనే తన పరపతిని ఉపయోగించి, మదురై హైకోర్టు బెంచ్ నుంచి జయకుమార్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు.
 
దీంతో అతన్ని అరెస్టు చేయలేమని పోలీసులు స్పష్టం చేయగా, భార్య, తన వద్ద ఉన్న ఆధారాలను తీసుకెళ్లి, మదురై కోర్టు ముందుంచింది. అతని దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కాదని వాపోయింది. ఇక వాటిని పరిశీలించిన న్యాయమూర్తులు, జామీనుపై విడుదల చేసేందుకు వీల్లేని సెక్షన్లు పెట్టి, తక్షణం నిందితులను అరెస్టు చేయాలని సూచించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు