ఆ 'నిషా' ప్రేమ మత్తులో దించి... ప్రియుడిని దోచుకున్న మహిళ

గురువారం, 10 సెప్టెంబరు 2020 (11:27 IST)
ఆమె పేరు నిషా.. పేరుకు తగ్గట్టే ఆమె ప్రవర్తన కూడా ఉంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువకుడికి మాయమాటలు చెప్పి.. తన సొంతూరుకు రప్పించుకుంది. ఆ తర్వాత తన ముఠా సభ్యులతో అతనిపై దాడి చేసి.. నగలు, నగదు, మోటార్ బైక్ దోచుకుంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిషాను అరెస్టు చేసిన పోలీసులు ఆమె ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా బన్రుట్టి జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడలూరు జిల్లా బన్రుట్టికి చెందిన వినోద్‌కుమార్‌ (31)కు వివాహమై ఓ కుమార్తె ఉంది. అతనికి పేస్‌బుక్‌ ద్వారా తిరుచ్చికి చెందిన నిషా పరిచయమైంది. ఆమె తరచూ అర్థనగ్న ఫొటోలను పోస్టు చేయడంతో పాటు, అతనితో తరుచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడేది. 
 
ఈ క్రమంలో, తనను చూసేందుకు ఈనెల 5వ తేదీన తిరుచ్చికి రావాలని నిషా కోరడంతో, ఎప్పటినుంచో ఆమెను కలుద్దామనుకున్న వినోద్‌, ఉద్యోగం విషయమై తిరుచ్చి వెళుతున్నానని భార్యతో చెప్పి, తన ద్విచక్రవాహనంలో తిరుచ్చికి వెళ్లాడు. కాజామలై ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాల సమీపంలో ఉన్నానని నిషా ఫోన్‌లో తెలపడంతో వినోద్‌ అక్కడకు వెళ్లాడు.
 
ఆ ప్రాంతంలో మాటువేసిన ఆరుగురు వ్యక్తులు వినోద్‌కు కత్తి చూపి బెదిరించి, అతని పర్స్‌, సెల్‌ఫోన్‌, ఏటీఎం కార్డ్‌ సహా మోటార్‌సైకిల్‌ను తీసుకొని పరారయ్యారు. ఈ ఘటనపై వినోద్‌ కేకే నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిషా సెల్‌ఫోన్‌ నెంబరు ఆధారంగా ఆమెతో సహా మహమ్మద్‌ యాసిర్‌, ఆషిక్‌లను అరెస్టు చేసి, పరారీలో ఉన్న అజీస్‌, సిద్ధిక్‌, అన్నారీల కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు