ఇటీవలికాలంలో సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కామాంధులుగా మారిపోతున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో శారీరకంగా కలుస్తూనే పెళ్లీడుకొచ్చిన ఆమె కుమార్తెపై కన్నేశాడు. అంతేనా.. ఆ యువతిని తనకిచ్చి పెళ్లి చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అతని వేధింపులు భరించలేని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, వేలూరు జిల్లా వాలాజా సమీపంలోని మేల్‌పుదుపేటకు చెందిన మహిళ (36) భర్తతో విభేధాలతో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈమెకు కావేరిపాక్కంకు చెందిన పోలీస్ కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడి.. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది.
అయినా అతని వేధింపులు ఆగక పోవడంతో ఆ మహిళ బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వాలాజా పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.