కిరాతక తల్లి.. మూడు నెలల బిడ్డను ఆ సుఖం కోసం చంపేసింది..

బుధవారం, 15 ఆగస్టు 2018 (13:59 IST)
వివాహేతర సంబంధానికి అడ్డుగా వుందని.. మూడు నెలల బిడ్డని గొంతు కోసి చెత్తకుప్పలో విసిరేసిన కిరాతక తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని దిండుక్కల్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. దిండుక్కల్, కొడైరోడ్డు సిరుమలై ప్రాంతానికి చెందిన కార్తీక్‌ (26). ఇతను కోవై శరవణంపట్టి ప్రాంతంలో ఉన్న రబ్బర్‌ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య వనిత (22). వీరికి శశిప్రియ (2), మూడు నెలల కవిశ్రీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కార్తీక్ ఎప్పటి లాగానే పనికి వెళ్లాడు. ఆపై బిడ్డను కిడ్నాప్ చేశారని డ్రామా చేసింది. 
 
అనంతరం భర్తకు ఫోన్‌ ద్వారా సమాచారం తెలిపింది. దీంతో వెంటనే కార్తీక్‌ ఇంటికి వచ్చి కవిశ్రీని పలు స్థలాలలో వెతికారు. తర్వాత శరవణంపట్టి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వనితను విచారించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆమెని తీవ్రంగా విచారణ చేపట్టారు.
 
ఇందులో వనిత బిడ్డను హత్య చేసినట్లుగా తెలిపింది. దీన్ని విన్న పోలీసులు, కార్తీక్‌ దిగ్భ్రాంతి చెందారు. ఈ కేసుపై పోలీసులు మాట్లాడుతూ వనితకి, పక్కింటికి చెందిన శ్రీనివాసన్‌కి వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండకూడదని మొదటి కుమార్తె శశిప్రియని పుట్టింటిలో వదిలిపెట్టింది. ఇక మూడు నెలల పసికందు కవిశ్రీ తరచూ ఏడుస్తూ ఉండేది. 
 
దీంతో తన వివాహేతర సంబంధానికి ఈ బిడ్డ అడ్డుగా ఉందని వనిత, శ్రీనివాస్‌ తలచారు. కార్తీక్‌ పనికి వెళ్లిన సమయంలో కన్నబిడ్డ అని చూడకుండా గొంతు నులిమి, కత్తితో గొంతు కోసి హత్య చేసింది. తరువాత బిడ్డ మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి ఇంటి సమీపంలో ఉన్న  చెత్తకుప్పలో విసిరేసి ఏమీ తెలియనట్లుగా ఇంటికి వచ్చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు