తౌక్టే తుపాను: 273మందితో కొట్టుకుపోయిన నౌక

సోమవారం, 17 మే 2021 (19:53 IST)
ముంబయి: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను దాటికి మహారాష్ట్ర సహా పలు తీర ప్రాంతాలు వణుకుతున్నాయి. పశ్చిమ వాయువ్యం దిశగా గంటకు 20 కి.మీల వేగంతో ‘తౌక్టే’ పయనిస్తోంది.

ఈ రాత్రికి గుజరాత్‌లోని పోరుబందర్‌- మహువా మధ్య తీరం దాటనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో తీర ప్రాంతాలను ఈ తుపాను హడలెత్తిస్తోంది.
 
ఈ రాత్రికి తౌక్టే తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబయి నగరానికి ఆరెంజ్‌ హెచ్చరిక జారీచేసింది. ఐసోలేటెడ్‌ ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ తుపాను వల్ల వీస్తున్న భీకరగాలులతో ముంబయికి పశ్చిమ తీరాన బాంబే హైవేలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది.

ఈ నౌకలో 273 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న నౌకాదళం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఐఎన్‌ఎస్‌ కొచ్చి యుద్ధ నౌక సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు