బ్లాక్ మార్కెట్ లో బీరు ధర రూ.350

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:27 IST)
సందట్లో సడేమియా అన్నట్లుగా తయారైంది కొందరి పరిస్థితి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ క్రమంలో మద్యం ఎక్కడా కూడా దొరకని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతుంది.

చిన్న చిన్న గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. నగరాల్లో మాత్రం కొందరు మందు లేక పిచ్చాసుపత్రుల్లో చేరుతుంటే, చిన్న చిన్న పట్టణాలు.. గ్రామాల్లో భారీ రేట్లకు అమ్ముతున్నారు, అది కూడా బ్లాక్ మార్కెట్లో.
 
బ్రాండ్‌ మద్యం ఫుల్‌ బాటిల్‌ అయితే.. రూ.2,500. స్ట్రాంగ్‌ బీరు అయితే రూ.350 అని బెల్టుషాపుల నిర్వాహకులు అమ్మేసుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖకు, పోలీసులకు దొరకకుండా.. లాక్‌డౌన్‌ అమలవుతున్నా.. పల్లెలు, పట్టణాల్లో భారీ రేట్లకు మద్యం పారుతుంది.

వైన్స్‌లు, బార్లు మూతపడినా కూడా బెల్టు షాపుల్లో జోరుగా మద్యం లభ్యం అవుతోంది. 11 రోజుల నుంచి బయట ఎక్కడా మద్యం అందుబాటులో లేకపోవడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ధరలను పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు.

తెలంగాణలో ఏడెనిమిది చోట్ల జరిగిన దాడుల్లో పోలీసులు మద్యం బాటిళ్లను పట్టుకోగా.. ప్రజలు ఫిర్యాదు చేస్తే తప్ప పోలీసులు పట్టుకోట్లేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా రూ.1,080 ధర ఉన్న మద్యం బాటిల్‌ను ప్రస్తుతం రూ.3 వేలకు అమ్ముతున్నారు.

రూ.700 ఉన్న బాటిల్‌ను రూ.1,500కు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. రూ.140కు లభించే ఒక బ్రాండ్‌ క్వార్టర్‌ను.. రూ.300కు, రూ.120 ధర ఉన్న ప్రీమియం బీర్‌ను కనిష్టంగా రూ.300కు, గరిష్టంగా రూ.350కు అమ్ముతున్నారు. స్ట్రాంగ్‌ బీరు బాటిల్‌ను రూ.350 తగ్గకుండా విక్రయిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు