టీవీలోని దెయ్యం పిల్ల బయటికి వచ్చేసింది.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు..

సోమవారం, 30 జనవరి 2017 (11:29 IST)
అదో టీవీ స్టోర్. టీవీలో దెయ్యం కనిపిస్తుంది. ఉన్నట్టుండి టీవీలోని దెయ్యం కాస్త నేల మీదకొచ్చింది. అంతే షాపులో ఉన్నవారంతా ఖంగుతిన్నారు. టీవీ కొందామని వచ్చిన వారంతా భయంతో జడుసుకున్నారు. ఇదంతా న్యూయార్క్‌లోని టీవీ స్టోర్‌లో చోటుచేసుకుంది. ఆ షాపులో కొన్ని వంద‌ల సంఖ్య‌లో టీవీలున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు క‌స్ట‌మ‌ర్లు వ‌స్తున్నారు. 
 
అయితే అప్పుడే స‌డెన్‌గా ఓ టీవీలో నుంచి దెయ్యం పిల్ల బ‌య‌టికి వ‌చ్చింది. దీంతో టీవీల‌ను కొనాల‌ని అక్క‌డికి వ‌చ్చిన వారు ఒక్క‌సారిగా భ‌యం చెంది, ఉలిక్కి ప‌డి ప‌రుగు లంకించుకున్నారు. అయితే… నిజానికి చెప్పాలంటే అది రియ‌ల్ దెయ్యం పిల్ల కాదు. ఆ టీవీ స్టోర్ వారు ఏర్పాటు చేసిందే.
 
క‌స్ట‌మ‌ర్లు రావ‌డానికి ముందే ఓ టీవీ వెనుక చిన్న‌పాటి గ‌ది ఏర్పాటు చేసి అందులో ఓ బాలిక‌ను అచ్చం ది రింగ్ ఇంగ్లిష్ సినిమాలోని దెయ్యం పిల్ల‌లాగా ఉంచారు. ఇంకేముంది.. కస్టమర్లు రాగానే ఆ పిల్ల కాస్తా టీవీని తప్పించి బయటకు వచ్చేసింది. అంతే కస్టమర్లు భయంతో పరుగులు తీశారు.

వెబ్దునియా పై చదవండి