తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే..

ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (07:52 IST)
లాక్‍డౌన్ తర్వాత భారతీయ రైల్వే 230 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లను, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇక సెప్టెంబర్ 12 నుంచి మరో 80 రైళ్లను నడుపుతోంది.
 
భారతీయ రైల్వే ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తాయి. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రైల్వే సర్వీసుల్ని ఉపయోగించుకోవచ్చు. 
 
రైలు నెంబర్ 07007 సికింద్రాబాద్ నుంచి దర్భంగా వెళ్తుంది. ప్రతీ మంగళవారం, శనివారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఇక రైలు నెంబర్ 07008 దర్భంగా నుంచి సికింద్రాబాద్ వస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం, శుక్రవారం నడుస్తుంది. 
 
రైలు నెంబర్ 08517 కోర్బా నుంచి విశాఖపట్నం వస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతీ రోజూ సాయంత్రం 4.10 గంటలకు ప్రారంభమవుతుంది. రైలు నెంబర్ 08518 విశాఖపట్నం నుంచి కోర్బాకు ప్రతీ రోజూ రాత్రి 8.05 గంటలకు అందుబాటులో ఉంటుంది. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
 
రైలు నెంబర్ 07563 హైదరాబాద్ నుంచి పర్భనీకి ప్రతీ రోజూ వెళ్తుంది. రైలు నెంబర్ 07564 పర్భనీ నుంచి హైదరాబాద్‌కు ప్రతీ రోజూ నడుస్తుంది.
 
రైలు నెంబర్ 02615 చెన్నై నుంచి న్యూఢిల్లీకి, రైలు నెంబర్ 02616 న్యూ ఢిల్లీ నుంచి చెన్నైకి ప్రతీ రోజూ వెళ్తాయి. ఈ రైళ్లు విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
 
రైలు నెంబర్ 02669 చెన్నై నుంచి చాప్రాకు సోమవారం, శనివారం, రైలు నెంబర్ 02670 ఛాప్రా నుంచి చెన్నైకి సోమవారం, బుధవారం నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
 
రైలు నెంబర్ 02663 హౌరా నుంచి తిరుచ్చిరాపల్లికి గురువారం, శనివారం, రైలు నెంబర్ 02664 తిరుచ్చిరాపల్లి నుంచి హౌరాకు మంగళవారం, శుక్రవారం నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
 
రైలు నెంబర్ 02509 బెంగళూరు నుంచి గువాహతికి బుధవారం, గురువారం, శుక్రవారం, రైలు నెంబర్ 02510 గువాహతి నుంచి బెంగళూరుకు సోమవారం, మంగళవారం, ఆదివారం నడుస్తాయి. ఈ రైళ్లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖటప్నం విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
 
రైలు నెంబర్ 08401 ఖుర్దా రోడ్ నుంచి ఓఖాకు ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1.55 గంటలకు, రైలు నెంబర్ 08402 ప్రతీ బుధవారం ఉదయం 8.30 గంటలకు బయల్దేరుతుంది. శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
 
15న కాచిగూడ రైల్వేస్టేషన్‌కు తొలిసారి రైలు
లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి ఈ నెల 15న కాచిగూడ రైల్వేస్టేషన్‌కు రైలు రానుంది. జైపూర్‌- మైసూర్‌ మధ్య వారానికి రెండుసార్లు నడవనున్న ఎక్స్‌ప్రెస్‌ (02976) రైలు జైపూర్‌ నుంచి బయలుదేరి ఈ నెల 15న రాత్రి 11.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది.

16న మధ్యాహ్నం 3.30 గంటలకు ఇక్కడి నుంచి మైసూర్‌కు వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు