తాజాగా తిరుప్పూర్ జిల్లా నిర్వాహకులు ఓపీఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు. జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నిర్వాహకులు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వంకు మద్దతుగా నిలిచారు. ఎంపీ సత్యభామ, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఉపకార్యదర్శి, జాయింట్ కార్యదర్శి, మైనారిటీ, రైతులు, జాలర్ల విభాగాలు, ఎంజీఆర్ మండ్రం, ఎంజీఆర్ యువకుల విభాగం, మాజీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మాజీ మున్సిపాలిటీ అధ్యక్షులంటూ అనేకమంది ఓపీఎస్‌కు మద్దతు తెలియజేశారు. దీంతో తిరుప్పూర్ జిల్లాకు సంబంధించిన వరకు శశికళ గుడారం ఖాళీ అయింది.