దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై న్యాయ విచారణకు ఆదేశించడంతో పాటు.. చెన్నై, పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసమైన వేద నిలయంను స్మారక మందిరంగా మార్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా.. దివంగత ముఖ్యమంత్రి జయలలితపై జ్యుడీషియల్ విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.