ఇకపై మొబైల్ నంబర్ పోర్టబులిటికీ సరికొత్త నిబంధన!!

ఠాగూర్

మంగళవారం, 19 మార్చి 2024 (07:55 IST)
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) మొబైల్ పోర్టబులిటీకి సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానం వల్ల మొబైల్ పోర్టబులిటీ ప్రక్రియ ఇకపై వారం రోజుల్లో పూర్తికాదు. స్విమ్ స్వాప్ మోసాలను అరికట్టే చర్యల్లో భాగంగా, ఈ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. మొబైల్ పోర్టబులిటీ అంటే... ప్రస్తుతం వినియోగిస్తున్న టెలికాం కంపెనీ నంబరును మరో టెలికాం నెట్‌వర్క్‌కు మార్చుకునే విధానం. ఈ విధానం తర్వాత ఆపరేటింగ్ నెట్‌వర్క్ మాత్రమే మారుతుంది. మొబైల్ నంబరులో ఎలాంటి మార్పు ఉండదు. అయితే, ఇటీవలి కావంలో స్విమ్ స్వాప్ మోసాలు పెరిగిపోయాయి. వీటికి చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ట్రాయ్ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 
 
సవరించిన నిబంధన మేరకు.. సిమ్ కార్డు దొంగతనానికి గురైనా, దెబ్బతిన్నా సంబంధిత వినియోగదారులు వారం రోజుల లోపల అదే నంబరుతో తిరిగి సిమ్‌ను పొందడం సాధ్యపడుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి అందిన సిఫార్సులను పరిశీలించాలని, వివిధ భాగస్వాములతో చర్చలు అనంతరం కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చామని ట్రాయ్ వెల్లడించింది. ఈ నిబంధన జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకిరానుంది. మోసాల కోసం సిమ్ స్వాప్, సిమ్ రీప్లేస్‌మెంట్‌లకు పాల్పడుతున్న వ్యక్తుల, సంస్థలకు అడ్డుకోడమే తమ లక్ష్యమని తెలిపింది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియలో యూనిక్ పోర్టింగ్ కోడ్ కీలకమైన దశ అని, తాజా మార్గదర్శకాల ప్రకారం ఏడు రోజుల వ్యవధిలోనే టెలికాం ఆపరేటర్లు  యూపీసీ కోడ్‌ను జారీ చేయలేరని ట్రాయ్ వివరించింది. 
 
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనంటున్న చైనా.. ప్రధాని మోడీ పర్యటన సబబు కాదు...
 
డ్రాగన్ కంట్రీ చైనా మరోమారు భారత్‌పై తన అక్కసు వెళ్ళగక్కింది. భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్  తమ భూభాగమేనంటూ ప్రకటించింది. ఈ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించడం ఏమాత్రం సబబు కాదని పేర్కొంది. పైగా, భారత్ చర్యలు ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు అనుకూలం కాదంటూ వ్యాఖ్యానించింది. చైనా వ్యాఖ్యలను భారత్ ముక్తకంఠంతో ఖండించింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సెలా సొరంగమార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పర్యటనపై చైనా తీవ్ర అభ్యంతరం చెప్పగా, కమ్యూనిస్టు దేశం వాదనలను భారత్ తిప్పికొట్టింది. దీనిపై స్పందించిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోని ప్రాంతమైనని తాజాగా ప్రకటించింది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ గుర్తించమని స్పష్టం చేసింది. 
 
గత కొంతకాలంగా డ్రాగన్ కంట్రీ విస్తరణవాదంతో రెచ్చిపోతుంది. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు కుయుక్తులు పన్నుతుంది. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. తాజాగా మరోమారు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం తమదేనంటూ వ్యాఖ్యానించింది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ గుర్తించమని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి మిలిటరీ సన్నద్ధతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం సెలా టన్నెల్ నిర్మించిన విషయం తెలిసిందే. సరిహద్దు వెంబడి సైన్యాల తరలింపునకు ఈ టన్నెల్ ఎంతో ఉపకరిస్తుంది. అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే సెలా సొరంగ మార్గం దేశభద్రత రీత్యా అత్యంత కీలకంగా మారింది. 13 వేల అడుగుల ఎత్తున ఈ సొరంగ మార్గం ప్రపంచంలోనే అతిపెద్ద బైలేన్ టన్నెల్‌గా పేరుగాంచింది.
 
ఇదిలావుంటే, నరేంద్ర మోడీ పర్యటనపై అప్పట్లో చైనా పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం రక్షించుకునే క్రమంలో తాము నిత్యం అప్రమత్తంగా ఉంటామని చైనా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. భారత్ చేపడుతున్న చర్యలు సరిహద్దు వెంబడి శాంతిస్థాపనకు అనుకూలం కాదని అన్నారు. అయితే, చైనా వాదనలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ భూభాగమేనని ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. చైనా పెట్టుకునే ఉత్తుత్తి పేర్లు క్షేత్రస్థాయిలో వాస్తవాలను మార్చబోవని ఇప్పటికే ఘాటుగా బదులిచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు