పన్నీర్ ఫారిన్ ట్రిప్పేశారు.. నిధులెక్కడివి.. చర్యలు తీసుకుంటాం: దినకరన్

ఆదివారం, 19 మార్చి 2017 (13:15 IST)
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు కష్టాలు తప్పేలా లేవు. పన్నీర్ సెల్వం అధికారంలో ఉన్న సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలు చేశారని.. తద్వారా అధికార దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ.. ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించనున్నట్లు ప్రత్యర్థులు సై అంటున్నారు.

పన్నీర్ సెల్వం, ఆయన కుటుంబ సభ్యులు విదేశీ పర్యటనలు చేపట్టడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ ప్రశ్నించారు. 
 
ఆదివారం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎకేం పార్టీ కోశాధికారిగా పని చేసిన సమయంలో పన్నీర్ సెల్వం పార్టీ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అన్నాడీఎంకే పార్టీ నిధులతో, అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి ఆయన కుటుంబ సభ్యులు విదేశీ పర్యటనలు చేశారని తాము గుర్తించామని ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఓపీఎస్‌పై దినకరన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఓపీఎస్ వర్గం నేతలు ఫైర్ అవుతున్నారు. దినకరన్ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకునేది లేదని దుయ్యబట్టారు.

వెబ్దునియా పై చదవండి