ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

ఐవీఆర్

బుధవారం, 23 జులై 2025 (23:06 IST)
మధ్యప్రదేశ్ నగరం ఇండోర్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ రెండు తలలు కలిగిన శిశువుకు ఎంటిహెచ్ ఆసుపత్రిలో జన్మనిచ్చింది. ఈ శిశివును సిజేరియన్ ద్వారా తీసారు. గర్భిణీ స్త్రీని గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ ప్రొఫెసర్ నీలేష్ దలాల్ అత్యవసర విభాగంలో చేర్చారు. ఆమెకు చాలా క్లిష్టమైన గర్భం ఉన్నట్లు కనుగొన్నారు.
 
ప్రసవ నొప్పి సమయంలో ఆ మహిళను అత్యవసర చికిత్సా విభాగంలో చేర్చారు. డాక్టర్ నీలేష్ దలాల్ మార్గదర్శకత్వంలో ఎంటిహెచ్ ఆసుపత్రి బృందం మహిళకు ఆపరేషన్ చేసి రెండు తలల బిడ్డను బైటకు తీసారు. కానీ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే దాదాపు ప్రతి నెలా గర్భధారణను తనిఖీ చేసే వైద్యులు లేదా ఇతర సిబ్బంది ఈ రెండు తలల శిశువు గురించి ఎలా కనుగొనలేకపోయారనేది. నవజాత శిశువును ఆసుపత్రిలోని అత్యవసర విభాగం పీడియాట్రిక్స్‌‍లో ఉంచారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు