తాజాగా మరో 68 మంది జవాన్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడ్డ సీఆర్‌పీఎఫ్ జవాన్ల సంఖ్య 127కు చేరింది. వారిలో ఒకరు మరణించగా, మరొకరు వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగతా 125 మందిలో 122 మంది ఈస్ట్ ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుకు చెందిన జవాన్లే కావడం గమనార్హం.