నోటీసులు అందజేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసులు తమను అనధికారికంగా నిర్బంధించారని సమృద్ధీ సకూనియా, స్వర్ణ ఝా జర్నలిస్టులు ట్విట్టర్‌లో ద్వారా తెలిపారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను వీరిద్దరూ సందర్శించారని, లేనిపోని విషయాలతో వర్గాల మధ్య శతృత్వం పెంచేలా ట్వీట్లు చేశారని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై తమముందు హాజరై విచారణ ఇవ్వాలని కోరినా స్పందించకుండా రాష్ట్రం వదిలి వెళ్లారని పోలీసులు చెప్పారు.
కాగా, జర్నలిస్టుల అరెస్టును ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. త్రిపురలో హింసపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులు సహా 71 మందిపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెల్సిందే.