ఇప్పటికే వాడుకలో ఉన్న పాత డిజైన్ టైర్లు 2023 ఏప్రిల్ 1 నుంచి రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్ ప్రమాణాలను, అదే ఏడాది జూన్ 1 నుంచి సౌండ్ ఎమిషన్ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
ఈమేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై కొత్త టైర్లు రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్ విషయాల్లో 'ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 142:2019'లో నిర్దేశించినట్లుగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ప్యాసింజర్ కార్లు, లైట్ ట్రక్కులు, ట్రక్కులు-బస్సులకూ ఈ నిబంధనలు వరిస్తాయని తెలిపింది.