అమ్మతానికి ఆమే ఆదర్శంగా నిలిచింది. పిల్లల చదువుల కోసం ఓ తల్లి తన కిడ్నీని అమ్మకానికి పెట్టింది. యూపీలోని ఆగ్రా, రోహత ప్రాంతానికి చెందిన ఆర్తి శర్మ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో తన కిడ్నీని అమ్మకానికి పెడుతూ తన ముగ్గురు కుమార్తెలు, కొడుకు చదువు కోసం ఈ పనిచేయక తప్పట్లేదని వాపోయింది. గార్మెంట్ షాపు నష్టాల్లో కూరుకుపోవడంతో.. పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేక ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆ తల్లి వెల్లడించింది.
ఆర్తి భర్త మనోజ్ శర్మ మాట్లాడుతూ.. పిల్లల చదువుల కోసం కిడ్నీని అమ్మాలని ఆమె నిర్ణయించుకుందని చెప్పారు. తాను టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని, నెలకు రూ.4-5 వేలు వస్తాయని పేర్కొన్నాడు. తమకు ప్రభుత్వం సాయం చేస్తే చిన్న వ్యాపారం ప్రారంభించి పిల్లలను చదివించుకుంటామని విజ్ఞప్తి చేశారు.