రోజూ ఎనిమిది లడ్డూలే ఆహారం.. విసిగిపోయి విడాకులు కోరిన భర్త

మంగళవారం, 20 ఆగస్టు 2019 (14:29 IST)
ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య అనుబంధం సన్నగిల్లిపోతుంది. స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫలితంగా చిన్న చిన్న కారణాల కోసం విడాకులు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. 
 
అలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ స్మార్ట్ ఫోన్ వల్ల దంపతులు విడాకులు కోరలేదు. తాంత్రికుడి సలహా మేరకు తన భార్య రోజు ఆహారానికి బదులు లడ్డూలే పెడుతుందని.. ఆహారం విషయంలో భార్యతో తనకు తరచూ గొడవలు వస్తున్నాయని.. అందుచేత విడాకులు ఇప్పించమని కోర్టు మెట్లెక్కాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బాధితుడికి పదేళ్ల క్రితం వివాహమయ్యింది. కోర్టుకెక్కిన దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు బాగానే సాగిన వీరి దాంపత్యంలో ఓ తాంత్రికుడి వల్ల కలతలు రేగాయి. గత కొద్ది కాలంగా బాధితుడు తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడు. దాంతో అతడి భార్య ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. 
 
అతని సూచన మేరకు బాదితుడికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నాలుగేసి చొప్పున లడ్డూలను భోజనంగా పెట్టింది  ఉదయం నాలుగు, సాయంత్ర నాలుగు చొప్పున లడ్డూలు భోజనంగా పెడుతుంది. ఇక ఏ పదార్థాన్ని తీసుకోకూడదని షరతు పెట్టింది. 
 
దీంతో విసిగిపోయిన బాధితుడు.. భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అధికారులు వీరిద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చే పనిలో పడ్డారు. అప్పటికి మనసు మార్చుకోకపోతే.. విడాకులు ఇప్పిస్తామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు