ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఔరియా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లయిన రెండు వారాలకే భర్తను అంతమొందించేందుకు ప్రియుడుతో కలిసి హత్య చేసింది. పోలీసుల కథనం మేరకు... నిందితులు ప్రగతి యాదవ్ (52), అనురాగ్ యాదవ్ ఇద్దరూ నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే, వీరి పెళ్లికి ప్రగతి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన దిలీప్‌తో ప్రగతి బలవంతంగా వివాహం జరిపించారు.
మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. బాధితుడు భార్య, ఆమె ప్రియుడు కలిసి దిలీప్ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది. వివాహం తర్వాత ఇద్దరూ కలుసుకునేందుకు వీలుపడకపోవడంతో దిలీప్‌ను హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా, కాంట్రాక్ట్ కిల్లర్ రామాజీ చౌదరీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం రూ.2 లక్షలు చెల్లించారు.
రామాజీ మరికొందరితో కలిసి బైకుపై దిలీప్‌ను పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ దిలీప్‌పై దాడి చేశారు. ఆ తర్వాత తుపాకీ కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు తుపాకులు, నాలుగు లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక పర్స్, ఆధార్ కార్డు, రూ.3 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులకు గాలిస్తున్నారు.