లఖింపూర్‌ ఘటన.. అజయ్ కుమార్ మిశ్రా కుమారుడిపై మర్డర్ కేసు

సోమవారం, 4 అక్టోబరు 2021 (10:35 IST)
Lakhimpur Kheri
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖీరీ ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాక సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై రైతులు లఖింపురి ఖీరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
 
ఈ ఘటనను కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్షాలు ఖండించాయి. అయితే ఈ ఘటనతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేర్కొన్నారు. కొంతమంది ఆందోళనకారులు కత్తులు, కర్రలతో దాడి చేశారని, ఆ సమయంలో అక్కడ తన కుమారుడు ఉండి ఉంటే సజీవంగా వచ్చేవాడు కాదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
 
కేంద్ర సహాయక మంత్రి అజయ్ కుమార్‌ మిశ్రా కుమారునిపై హత్య కేసు నమోదు చేసినట్లు యుపి పోలీసులు తెలిపారు. అయితే తన కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఘటనాస్థలిలో లేడని మంత్రి ఆరోపిస్తున్నారు. 
 
''కొందరు దుండగులు కర్రలు, కత్తులతో రైతులపై దాడి చేశారని, నా కుమారుడు అక్కడ ఉండి వుంటే ప్రాణాలతో బయటపడేవాడు కాదని మిశ్రా పేర్కొన్నారు. తమ కుమారుడు వేడుక జరిగే ప్రాంతంలో ఉన్నాడని, తాను ఉప ముఖ్యమంత్రి వెంట ఉన్నానని'' చెప్పుకొచ్చారు. 
 
కాగా, లఖింపూర్‌ ఖేర్‌ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారని, సెక్షన్‌ 144 విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని యుపి పోలీసులు వివరించారు.
 
లఖింపూర్‌ ఖేర్‌ జిల్లాలో ఆదివారం రైతులపై క్రూరంగా కారుతో తొక్కించిన ఘటనలో రైతు సహా ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. మంత్రి కుమారునితో పాటు మరి కొందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. 
 
గత నెలచివరలో మిశ్రా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను విరమించుకున్నారని.. కేవలం 10-15 మంది నిరసన చేస్తున్నారని, వారిని అక్కడి నుండి ఖాళీ చేయించాలంటే ప్రభుత్వానికి రెండునిమిషాలు చాలని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మంత్రుల పర్యటనను అడ్డుకోవడానికి రైతులు ఆదివారం సమావేశమయ్యారు. దీంతో ఆగ్రహించిన మంత్రి కాన్వారుతో రైతులను తొక్కించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు