శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలని.. ఆరో అంతస్తు నుంచి దూకేసింది..

సోమవారం, 25 జనవరి 2021 (10:01 IST)
ఆధునికత పెరిగినా మూఢనమ్మకాలు మాత్రం పెరిగిపోతూనే వున్నాయి. ఆధ్యాత్మికత వైపు జనాలు ఆసక్తి చూపుతున్నామని.. మూఢ నమ్మకాలను నమ్మేస్తున్నారు. తాజాగా..శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలన్న మూఢభక్తితో.. మహిళ అపార్ట్‌మెంట్‌లోని ఆరో ఫ్లోర్ నుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వ్రింధావన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తాత్యానా హెమోలోవ్ స్కయా (41).. స్వస్థలం రష్యాలోని రోస్తోవ్ నగరం. మహిళా టూరిస్టు వీసాపై భారత్ వచ్చింది. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి అపార్ట్ మెంట్‌లో నివాసం ఉంటోంది. దీనిని రష్యన్ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఆరో ఫ్లోర్‌లో ఒంటరిగా ఉంటోందని పోలీసులు తెలిపారు. 
 
ఈమె శ్రీ కృష్ణుడి భక్తురాలు. ఈమె స్నేహితుల్లో ఒకరు అదే భవనంలో ఉన్నారని, శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలని కోరుకుటున్నట్లు హెమోలోవ్ వెల్లడించేదని స్నేహితురాలు చెప్పిందన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని, రష్యా రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యిందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు