అదనపు కట్నం కోసం గొడవ... భార్య గొంతు నులిమి హత్య చేసిన భర్త

సోమవారం, 30 ఆగస్టు 2021 (16:35 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌‌లో ఓ కసాయి భర్త అదనపు కట్నం కోసం భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అదనపు కట్నం విషయమై భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగడంతో నిగ్రహం కోల్పోయిన భర్త... భార్యను చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాకు చెందిన మోసిన‌, యాస్మిన్ మూడు సంవ‌త్స‌రాల క్రితం వివాహం చేసుకున్నారు. జిల్లాలోని చౌసానా ప‌ట్ట‌ణంలో దంప‌తులిద్ద‌రూ నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లు యాస్మిన్‌ను బాగానే చూసుకున్న మోసిన్ ఆ త‌ర్వాత అద‌న‌పు క‌ట్నం కోసం వేధించ‌సాగాడు.
 
ఈ క్రమంలో వారిద్దరి మధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతూ వచ్చాయి. ఆదివారం కూడా క‌ట్నం విష‌యమై భార్యాభ‌ర్త‌లు గొడ‌వ‌ప‌డ్డారు. మాటామాటా పెరుగ‌డంతో ఆగ్ర‌హించిన మోసిన భార్య‌ను గొంతు నులిమి చంపేసి పారిపోయాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసు.. పరారీలో ఉన్న మోసిన కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు