చికెన్ గున్యా జ్వరానికి వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. యూరప్‌కు చెందిన వాల్నేవా అనే కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అయితే, ఈ టీకా వాడేందుకు అమెరికా ఆరోగ్య సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఆమోదముద్ర వేసింది. దోమల ద్వారా వ్యాపించే చికెన్ గున్యా వైరస్‌ను ఈ టీకా ద్వారా అడ్డుకోవచ్చని ఎఫ్.డి.ఏ అధికారులు తెలిపారు.
జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు కలిగించే ఈ చికెన్ గున్యా ముఖ్యంగా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. గత 15 యేళ్లలో దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలు ఈ వైరస్ బారినపడ్డారు.
ఇక క్లినికల్ ప్రయోగాల్లో భాగంగా, నార్త్ అమెరికాలో 3500 మందిపై ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించినట్టు వెల్లడించారు. అయితే, ఈ వ్యాక్సిన్‌ను వల్ల తలనొప్పి, అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు, జ్వరం, వికారం వంటి సాధారణ దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.